Page Loader
Chiranjeevi : 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్
'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్

Chiranjeevi : 'సమరసింహారెడ్డి' స్ఫూర్తితో 'ఇంద్ర'సినిమా చేశానన్న మెగాస్టార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 02, 2024
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ రంగంలో 50 ఏళ్లకు పూర్తి చేసిన సందర్భంగా నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీ నుండి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొనగా, ఆయనతో పాటు విక్టరీ వెంకటేష్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, శివ రాజ్ కుమార్, ఉపేంద్ర వంటి పలువురు ప్రముఖ హీరోలు వచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చిరంజీవి ప్రశంసించారు. బాలకృష్ణ 50 సంవత్సరాల సినీ ప్రయాణం, తెలుగు సినిమా పరిశ్రమకే ఒక పండుగ అని చిరు చెప్పారు.

Details

బాలకృష్ణతో కలిసి ఫ్యాక్షన్ సినిమా చేయాలని ఉంది

నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ తన తండ్రి చేసిన పాత్రలను సమర్థంగా నిర్వహించి, ప్రేక్షకుల మన్ననలు పొందడం మామూలు విషయం కాదన్నారు. తనకు ఇంద్ర సినిమా చేయడానికి బాలకృష్ణ సమరసింహా రెడ్డి సినిమానే కారణమన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయాలని చిరంజీవి తన మనస్సులోని కోరికను బయటపెట్టాడు.

Details

బాలకృష్ణపై చిరంజీవి ప్రశంసలు

బాలకృష్ణ తన కుటుంబంతో జరిగిన ప్రతి శుభకార్యంలో పాల్గొంటారని, ప్రతి సందర్భంలో తమతో కలిసి డ్యాన్స్ చేస్తారని చిరంజీవి గుర్తు చేశారు. బాలకృష్ణ నటనా రంగంలో మాత్రమే కాకుండా రాజకీయ, వైద్య రంగాల్లో కూడా తన సేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. భగవంతుడు ఆయనకు ఇదే ఎనర్జీని ఇస్తూ.. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలనుకుంటున్నట్లు చిరంజీవి అన్నారు.