తదుపరి వార్తా కథనం
Mass Jathara : రవితేజ 'మాస్ జాతర' నుంచి మెలోడి సాంగ్ 'హుడియో హుడియో' రిలీజ్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 08, 2025
12:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న భారీ యాక్షన్-ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం 'మాస్ జాతర' భాను భోగవర్పు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్31న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పాటలను విడివిడిగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 'తు మేరా లవర్', 'ఓలే ఓలే' పాటలు విడుదల అయ్యి మంచి స్పందన పొందాయి. తాజాగా మూడో పాట 'హుడియో హుడియో'ని విడుదల చేశారు.ఈమెలోడీకి భీమ్స్ సిసిరోలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. 'దేవ్' సాహిత్యాన్ని రాసి, హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ కలసి ఈ పాటను పాడారు.