Page Loader
మరోసారి మిరపకాయ్ కాంబో.. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ లైన్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ 
మరోసారి మిరపకాయ్ కాంబో

మరోసారి మిరపకాయ్ కాంబో.. హరీష్ శంకర్ చెప్పిన స్టోరీ లైన్ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 04, 2023
07:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే.అయితే రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. 2006లో షాక్ సినిమాతో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. రవితేజ, జ్యోతిక కాంబోలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోలేకపోయింది. 5 ఏళ్ల తర్వాత 2011లో వచ్చిన మిరపకాయ్ సినిమాతో ఈ జోడి మరోసారి రిపీట్ అయింది. అయితే మిరపకాయ్ సూపర్ డూపర్ హిట్ కావడం విశేషం. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత హరీష్‌ శంకర్‌కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

details

రవితేజ కోసం ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న హరీష్ శంకర్

ఆ తర్వాత బంపర్‌ హిట్లతో దర్శకుడిగా చెలరేగిపోయాడు. తక్కువ కాలంలోనే స్టార్ డైరెక్టర్ హోదా సైతం దక్కించుకున్నాడు. కమర్షియల్‌ హిట్లకు కేరాఫ్ అడ్రెస్‌గా పేరు గడించాడు. ప్రస్తుతం హరీష్‌ శంకర్‌ ఉస్తాద్ భగత్‌సింగ్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇటీవలే రవితేజను కలిసిన హరీష్ ఓ లైన్‌ చెప్పాడని సమాచారం. రవితేజకు ఆ లైన్‌ బాగా నచ్చడంతో ఫుల్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయమన్నాడని వినికిడి. ఉస్తాద్‌ను పూర్తి కాగానే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫుల్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి మాస్ రాజాను ఇంప్రెస్‌ చేసే పనిలో ఉన్నాడీ దర్శకుడు. అయితే పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.