Mission Impossible: 'మిషన్ ఇంపాజిబుల్ - ఫైనల్ రికనింగ్' తెలుగు ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్ ప్రముఖ నటుడు టామ్ క్రూజ్ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమాలన్నీప్రపంచవ్యాప్తంగా అద్భుత విజయాలను సాధించిన విషయం తెలిసిందే.
భారత్‌లో కూడా ఈ సిరీస్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.ఇక్కడ కూడా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టాయి.
ఇప్పటివరకు మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో ఏడు భాగాలు విడుదల కాగా, ఇప్పుడు ఎనిమిదవ చిత్రం రాబోతుంది.
'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రికనింగ్'కు కొనసాగింపుగా 'ఫైనల్ రికనింగ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివరాలు
ఇంపాజిబుల్ సిరీస్‌కు ముగింపు
టామ్ క్రూజ్ నటించిన ఈ మిషన్ ఇంపాజిబుల్ - ఫైనల్ రికనింగ్ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.
ఆకట్టుకునే ఈ ట్రైలర్‌ను మీరు కూడా తప్పకుండా చూడండి.
మరోవైపు, ఈ సినిమా 2025 మే 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం ద్వారా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌కు ముగింపు పలుకనున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి నెలకొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్': తెలుగు ట్రైలర్
Mission Impossible The Final Reckoning Trailer: టామ్ క్రూజ్ ‘మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకనింగ్’: తెలుగు ట్రైలర్ వచ్చేసింది#cinemahttps://t.co/ZEKcfhbPKB
— Eenadu (@eenadulivenews) April 7, 2025