Mohan Babu: హెల్త్ బులెటిన్.. మోహన్ బాబు ఎడమ కంటికి గాయం
మంచు మోహన్ బాబు మంగళవారం రాత్రి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో,ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యుల ప్రకారం,మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదని, ఆయన మానసికంగా బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి,ఆయన తన పరిస్థితిని అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ఎడమ కంటి కింద గాయమై ఉండగా,కుడివైపు కంటి కింద వాపు కనిపించింది. ఇవాళ ఆయనకు సిటిస్కాన్ నిర్వహించాల్సి ఉంది. అలాగే, మోహన్ బాబు హైబీపీతో బాధపడుతున్నారని, హార్ట్ రేట్ కూడా పెరిగి ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరికొన్ని రోజులు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి ఉంటుంది.