Manchu Manoj: మంచు ఫ్యామిలీ పరస్పర దాడులు, ఫిర్యాదులు.. అసలు విషయం ఇదే
మంచు ఫ్యామిలీలో మరోసారి తీవ్ర విభేదాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తన తండ్రి మోహన్ బాబు, తన భార్యపై దాడి చేసినట్లు మంచు మనోజ్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారని ఇతర మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరణలపై ఇంకా స్పష్టత రాలేదు. మోహన్ బాబుకు చెందిన పీఆర్ టీమ్ స్పందించింది. మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు అసత్య ప్రచారాలను కొన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయని పేర్కొంది. మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో అసలు నిజం లేదని స్పష్టం చేసింది.