దృశ్యం దర్శకుడితో మోహన్ లాల్ మరో సినిమా: దృశ్యం 3 ఉండనుందా?
ఈ వార్తాకథనం ఏంటి
మలయాళీ నటుడు మోహన్ లాల్ నటించిన దృశ్యం సినిమా ఎంత పాపులరో అందరికీ తెలుసు. మలయాళం నుండి ఇతర భాషల్లో రీమేక్ అయ్యి మంచి విజయం అందుకుంది ఈ చిత్రం.
దృశ్యం సినిమాను జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.
ప్రస్తుతం జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు మోహన్ లాల్. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో మారు జీతూ జోసెఫ్ తో సినిమా ప్రకటన రావడం అందరికీ ఆశర్యంగా ఉంది.
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా, దృశ్యం 3 అయ్యుంటుందని అందరూ అనుకుంటున్నారు.
Details
200కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రం
దృశ్యం సినిమాకు ఇప్పుడు రూపొందే కొత్త సినిమాకు ఎలాంటి సంబంధం లేదట. కొత్త జోనర్ లో సరికొత్త సినిమా తెరకెక్కుతోందని సమాచారం.
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఇతర విషయాలేవీ వెల్లడి చేయలేదు.
అదలా ఉంచితే, పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న వృషభ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య సాగే ఈ డ్రామాలో మోహన్ లాల్ కొడుకుగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించనున్నాడని వార్తలు వచ్చాయి.
బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు నందకిషోర్ తెరకెక్కిస్తున్నారు. 200కోట్ల బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాను 2024లో విడుదల చేయాలని చిత్రబృందం అనుకుంటోంది.