Page Loader
Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు
మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు

Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యమైన కథల ఎంపికతో, తనదైన నటనతో మోహన్‌లాల్‌ వరుసగా బ్లాక్‌బస్టర్లను అందిస్తూ మలయాళ సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించారు. తాజాగా విడుదలైన 'తుడరుమ్' చిత్రంతో మోహన్‌లాల్‌ సెన్సేషన్ సృష్టించారు. కేరళ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లను వసూలు చేసిన తొలి మలయాళ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. అంతకుముందు 'ఎల్2 ఎంపురాన్' సినిమాతోనూ భారీ విజయాన్ని అందుకున్నారు. మే 21 మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం

Details

రెజ్లింగ్‌ స్టేట్ ఛాంపియన్

నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించిన మోహన్‌లాల్‌కు ఓ అరుదైన స్థానం ఉంది. సినిమాల్లోకి రాకముందు ఆయన 1977, 1978లో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్‌గా నిలిచారు. అయితే నటనపై ఉన్న ప్రేమతో ఆ రంగాన్ని వదిలేశారు. విద్యార్థి దశలోనే నాటకాల ద్వారా ఆయన నటనా ప్రయాణం మొదలైంది.

Details

విలన్‌గా తెరంగేట్రం

ప్రస్తుతం హీరోగా, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోహన్‌లాల్‌ విలన్ పాత్రతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1980లో వచ్చిన మలయాళ చిత్రం'మంజిల్ విరింజ పూక్కల్'ద్వారా ఆయన సినీ అరంగేట్రం చేశారు. ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటించిన ఆయనకు ఆ తర్వత కూడా విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చేవి. అయితే తన ప్రతిభతో హీరోగా ఎదిగి సూపర్ స్టార్‌గా మారారు. ఏడాదిలో 34 సినిమాలు 1986 సంవత్సరం మోహన్‌లాల్ కెరీర్‌లో అత్యంత కీలకమైనది. ఆ ఏడాది ఆయన ఏకంగా 34 సినిమాలు చేశారు. అంటే సగటున ప్రతి 11 రోజులకు ఒక సినిమా చేశారు. ఆశ్చర్యకరంగా వీటిలో 25 సినిమాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఇప్పటివరకు ఏ ఇతర నటుడు ఈ రికార్డును అధిగమించలేకపోయాడు.

Details

ఐదు సార్లు జాతీయ అవార్డు విజేత

నటుడిగా మోహన్‌లాల్‌కు అభిమానుల ప్రేమతో పాటు అవార్డుల వర్షం కూడా దక్కింది. ఆయన ఇప్పటివరకు ఐదు సార్లు జాతీయ అవార్డులు గెలిచారు. ఇది ఏ నటుడికైనా గర్వించదగిన ఘనత. 'కిరీడం', 'భారతం', 'వనప్రస్తం', 'జనతా గ్యారేజీ', 'ముంతిరివల్లికల్' సినిమాల్లో ఆయన ప్రదర్శించిన నటనకు ఈ అవార్డులు లభించాయి. పుట్టినరోజు సందర్భంగా మోహన్‌లాల్‌ అభిమానులు ఆయన కెరీర్‌ను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువగా వస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటూ వస్తున్న ఈ నాటుడికి భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందాలని కోరుకుందాం.