
ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. థియేటర్లన్నీ కొత్త కొత్త సినిమాలతో కళకళలాడుతూనే ఉంటాయి. ఈ వారం (మే 12వ తేదీన) రిలీజ్ అయ్యే సినిమాలేంటో చూద్దాం.
కస్టడీ:
ఈ వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమా ఇదే అని చెప్పవచ్చు. నాగ చైతన్య, క్రితిశెట్టి నటించిన ఈ సినిమా, మే 12న రిలీజ్ అవుతోంది.
తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. బాధ్యతగల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగ చైతన్య కనిపిస్తున్నాడు.
ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈసారైనా నాగ చైతన్యకు హిట్ పడుతుందా లేదా చూడాలి.
Details
శ్రియా నటించిన మ్యూజిక్ స్కూల్ చిత్రం థియేటర్లలోకి
భువన విజయమ్:
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యలమంద చరణ్ డైరెక్ట్ చేసారు. కామెడీ, సస్పెన్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో కీలక పాత్రల్లో వైవా హర్ష కనిపిస్తున్నాడు.
మ్యూజిక్ స్కూల్:
హీరోయిన్ శ్రియా శరణ్, శర్మాణ్ జోషి నటిస్తున్న ఈ చిత్రాన్ని పాపారావ్ బియ్యాల నిర్మించి దర్శకత్వం వహించారు. పిల్లలకు చదువుతో పాటు వేరు వేరు విద్యలు కూడా అవసరం అన్న కాన్సెప్ట్ తో వస్తోంది.
ఫర్హానా:
ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు.