Page Loader
SSMB29: మహేష్ బాబుతో సినిమా.. 'ఆర్ఆర్ఆర్' మించి సన్నివేశాలు : రాజమౌళి
మహేష్ బాబుతో సినిమా.. ఆర్ఆర్ఆర్ మించి సన్నివేశాలు : రాజమౌళి

SSMB29: మహేష్ బాబుతో సినిమా.. 'ఆర్ఆర్ఆర్' మించి సన్నివేశాలు : రాజమౌళి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం #SSMB29 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజమౌళి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఓ అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేశ్‌తో తీస్తున్న సినిమాలో 'ఆర్ఆర్ఆర్'లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులుంటాయని పేర్కొన్నారు. తనకు జంతువులంటే చాలా ఇష్టమని, గతంలో ఆర్ఆర్ఆర్‌లో జంతువులను ఉపయోగించానని, కానీ, ఈ కొత్త చిత్రం 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ జంతువులు ఉంటాయన్నారు.

Details

శరవేగంగా ఫ్రీ ప్రొడక్షన్ పనులు

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహేశ్‌బాబుతో రూపొందిస్తున్న చిత్రానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయాన్ని ఉపయోగించాలని ఆయన భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కథ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుంటే, ఒకే భాగంలో చెప్పడం సాధ్యపడకపోవచ్చని చిత్ర బృందం భావిస్తోంది. మరోవైపు, ఈ మూవీ షూట్ జనవరి నుంచి ప్రారంభమవుతుందని రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కథను రాయడానికి దాదాపు రెండేళ్లు పట్టిందన్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంతో తీసే ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు నటించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.