
Mrunal Thakur: ప్రభాస్‌తో సినిమా.. చేయట్లేదు అని చెప్పిన మృణాల్ ఠాకూర్
ఈ వార్తాకథనం ఏంటి
'సీతారామం' సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇక్కడ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఆ తర్వాత నానితో చేసిన 'హాయ్ నాన్న' కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక విజయ దేవరకొండతో తీసిన 'ఫ్యామిలీ స్టార్' మృణాల్ ఠాకూర్‌కి హ్యాట్రిక్ ఇవ్వలేకపోయింది.
వరుస విజయాలతో జోరుమీద ఉన్న ప్రభాస్, డైరక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమాను తీస్తున్నాడు.
ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ తెరకెక్కే ఈ లవ్ స్టోరికి 'ఫౌజీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి.
Details
స్పందించిన మృణాల్ ఠాకూర్
ఆగస్టు 17న 'ఫౌజీ' మూవీ నుంచి ప్రభాస్, మృణాల్ ఠాకూర్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేస్తున్నట్లు 'ఫిల్మ్ ఫేర్' ఓ కథనాన్ని కూడా ప్రచురించింది.
అయితే దీనిపై మృణాల్ ఠాకూర్ స్పందించింది.
ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తాను ఈ సినిమాలోనే లేనంటూ ఆమె కామెంట్ చేసింది.
మీ ఉత్సాహాన్ని చెడకొడుతున్నందుకు సారీ, కానీ నేను ఈ సినిమాలో లేనంటూ మృణాల్ ఠాగూర్ కామెంట్ చేసింది. అయితే ఫౌజీ మూవీలో హీరోయిన్ ఎవరో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.