LOADING...
<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Isaignani Ilaiyaraaja: స్వర మాంత్రికుడు ఇళయరాజా..పుట్టినరోజు శుభాకాంక్షలు</span>
స్వర మాంత్రికుడు ఇళయరాజా..పుట్టినరోజు శుభాకాంక్షలు

Isaignani Ilaiyaraaja: స్వర మాంత్రికుడు ఇళయరాజా..పుట్టినరోజు శుభాకాంక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
Jun 03, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ మ్యూజిక్ వరల్డ్‌లో దశాబ్దాలుగా స్వరాల సామ్రాజ్యానికి రాజులా ఏలుతున్న 'ఇసైజ్ఞాని' ఇళయరాజాకు నేడు 83వ పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు జూన్ 3వ తేది అయినా తమిళనాడు దివంగత నేత ఎం.కరుణానిధి జయంతి కూడా అదే రోజు ఉంది. దీంతో ఆయనపై గౌరవార్థం ఒక రోజు ముందే అంటే జూన్ 2న ఇళయరాజా తన జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. ఆ మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజాకు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వివరాలు

8600 పాటలు పాడిన సంగీత రాజు..

సంగీతమే శ్వాసగా ఇళయరాజా కెరీర్‌ సాగింది. ఇప్పటివరకు ఏకంగా 8,600 కి పైగా పాటలకు అద్భుతమైన స్వరాలు ఆయన సమకూర్చడం విశేషం. కేవలం సౌత్ ఇండియాలోనే కాకుండా భారతీయ సినిమా సంగీత గమనాన్ని మార్చిన ఘనత ఆయనకే సొంతం అవుతుంది. సంగీత ప్రపంచంలో ఆయన చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం 'పద్మవిభూషణ్' తో ఆయన్ని సత్కరించడం విశేషం. ఇప్పటి వరకూ ఆయనకు 5 జాతీయ అవార్డులు వచ్చాయి.

వివరాలు

సరికొత్త ట్యూన్స్‌తో ముందుకు..

83 ఏళ్ల వయసులోనూ ఆయన అదే ఉత్సాహంతో సరికొత్త ట్యూన్స్‌ చేస్తూ ముందుకు సాగుతున్నారు. నేటి తరం యువ దర్శకుల మేకింగ్ స్టైల్‌కు తగ్గట్టుగా మ్యూజిక్ అందిస్తూ సినిమా లవర్స్‌ను కట్టిపడేస్తున్నారు ఇళయరాజా. సినీ ఇండస్ట్రీ నుంచి ఇళయరాజా మ్యూజిక్‌తో తమ కెరీర్‌లో ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించారు. జన్మదినం సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ నటీనటులు, టెక్నీషియన్స్ మాస్ట్రోకు నీరాజనాలు పడుతున్నారు.

Advertisement