Loading...
Alia Bhatt: నా మనసు ముక్కలైంది.. NEET వివాదంపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
నా మనసు ముక్కలైంది.. NEET వివాదంపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Alia Bhatt: నా మనసు ముక్కలైంది.. NEET వివాదంపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2026
10:18 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల వరకు విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ ఉద్యమానికి క్రమంగా సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్, ప్రీతి జింటా ఈ అంశంపై స్పందించగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా మౌనం వీడి విద్యార్థులకు మద్దతుగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది.

వివరాలు 

విద్యార్థుల ధైర్యం ఆశను కలిగిస్తోంది

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన ఆలియా భట్.. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు.

గడిచిన కొన్ని రోజులు నా మనసును ముక్కలు చేశాయి. అయితే అదే సమయంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్న ధైర్యం నాకు ఆశను కలిగిస్తోంది.

ప్రతి విద్యార్థి వెనుక ఒక కల ఉంటుంది. ఒక కుటుంబం ఆశలు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. వారు కేవలం తమ కోసమే కాదు.. వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం కూడా పోరాడుతున్నారని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

భవిష్యత్తు వారిదే.. వారి స్వరాన్ని వినాలి

యువతే దేశ భవిష్యత్తును నిర్మించబోతున్నారని ఆలియా భట్ అభిప్రాయపడ్డారు. అందుకే విద్యార్థుల గొంతును వినాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

NEET పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు కూడా సంఘీభావం ప్రకటించారు.

హుమా ఖురేషి, సాకిబ్ సలీమ్, ప్రకాశ్ రాజ్, షబానా అజ్మీ, స్వరా భాస్కర్ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

నటి అయేషా ఖాన్ అరెస్ట్ వీడియో వైరల్

మరోవైపు, నిరసనల్లో పాల్గొన్న నటి అయేషా ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తాను ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ.. పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని అయేషా ఆరోపించారు.

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థుల నిరసనలను అణిచివేయకుండా వారి సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన NEET వివాదం

NEET పేపర్ లీక్ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది.

విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌లు మరింత బలపడుతున్నాయి.

ADVERTISEMENT