LOADING...
Mythri Movie Makers: మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్  భారీ ఆఫర్? 
మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్ భారీ ఆఫర్?

Mythri Movie Makers: మహేష్ బాబుతో కొత్త ప్రాజెక్ట్ కోసం మైత్రి మూవీ మేకర్స్  భారీ ఆఫర్? 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం SSMB29 షూటింగ్‌లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడానికి సుమారు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగినట్లే,ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు,క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే మహేష్ మాత్రం ఎలాంటి తొందరపాటు లేకుండా, తన కెరీర్‌ను క్రమపద్ధతిగా ప్లాన్ చేస్తూ ఈ చిత్రంపైనే దృష్టి సారిస్తున్నాడు.

వివరాలు 

భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధమైన మైత్రి మూవీ మేకర్స్ 

రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యాక మహేష్ బాబుతో సినిమా చేయాలని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇప్పటివరకు ఈ ఆఫర్‌ను అంగీకరించకపోవడమే కాకుండా, తిరస్కరించలేదని కూడా వినిపిస్తోంది. తన కెరీర్‌లో ప్రతి ప్రాజెక్ట్‌ను బాగా ఆలోచించి ఎంపిక చేసుకునే అలవాటు ఉన్న మహేష్, ఈ సినిమాపై కూడా తగిన సమయం తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు.

వివరాలు 

టాప్ డైరెక్టర్లతో చర్చలు

మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి దర్శకుడిని ఎంపిక చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్‌కుమార్ వంటి టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్‌లో టాక్. ఈ దర్శకులు తమ సొంత శైలిలో మహేష్ బాబును పూర్తిగా కొత్త రేంజ్‌లో ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి శ్రీమంతుడు, సర్కారు వారి పాట చిత్రాల్లో పని చేసిన విషయం తెలిసిందే.