Page Loader
Na Saami Ranga : నా సామి రంగా నుంచి మరో అప్డేట్.. నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్
నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్

Na Saami Ranga : నా సామి రంగా నుంచి మరో అప్డేట్.. నాగార్జున, ఆషికా రంగనాథ్ ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే మేకింగ్ రిలీజ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 13, 2023
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌ మన్మథుడు అక్కినేని నాగార్జున నటిస్తున్న 'నా సామిరంగ'కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పాట‌కు సంబంధించి చిత్రబృందం మేకింగ్ వీడియో విడుద‌ల చేసింది. ఇందులో నాగార్జున మాస్ లుక్‌తో హ్యాండ్సమ్‌గా అలరిస్తున్నారు.పక్కనే జోడి కట్టిన హీరోయిన్ ఆషికా రంగనాథ్ సాంప్రదాయకమైన లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా న‌టిస్తున్న సినిమాకి విజయ్‌ బన్నీ దర్శకుడిగా తొలి చిత్రాన్ని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కుల ముందుకు రానుందని నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి వెల్లడించారు. ఇటీవలే ఈ మూవీ నుంచి ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పాటను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ పాటలో నాగ్, రంగనాథ్ మధ్య సాగే కలర్‌ ఫుల్ ట్రాక్‌ సినిమాకే పెట్టని కోటగా మారనుందని విజువల్స్ నిరూపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే సాంగ్ మేకింగ్ విజువల్స్ రిలీజ్