
Naa Saami Ranga Review: 'నా సామిరంగ' మూవీ ఎలా ఉందంటే!
ఈ వార్తాకథనం ఏంటి
Naa Saami Ranga Review: టాలీవుడ్ కింగ్ నాగార్జున-విజయ్ బిన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'నా సామిరంగ'.
సంక్రాంతి కానుకగా ఆదివారం ఈ మూవీ థియేటర్స్‌లోకి వచ్చింది.
ఈ మూవీ ఎలా ఉంది? సంక్రాంతి రేసులో విన్నింగ్ సాధించా? తెలుసుకుందాం.
కథ: అంబాజీపేట గ్రామంలో కిష్టయ్య(నాగార్జున) కుటుంబానికి.. పెద్దయ్య(నాజర్) అండగా నిలుస్తాడు.
కిష్టయ్య.. వరాలు (ఆషికా రంగనాథ్)అనే యువతిని ప్రేమిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోతారు.
పెద్దయ్య కొడుకు దాసు(షబీర్ కల్లరక్కల్).. కిష్టయ్య, అతని సోదరుడు అంజి (అల్లరి నరేష్)కి హాని చేయాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పోరాటం మొదలవుతుంది?
వరాలు, కిష్టయ్య ఎందుకు విడిపోయారు? భాస్కర్(రాజ్ తరుణ్) కథలోకి ఎందుకు వస్తాడు? అనేది సినిమా స్టోరీ.
మూవీ
ప్లస్ పాయింట్లు..
నాగార్జున తన నటనతో ఆకట్టుకున్నారు. అతని మాస్ అప్పీల్, లుక్స్, డైలాగ్ డెలివరీ, ఆన్-స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టారు.
హీరోయిన్ ఆశికా రంగనాథన్ తన వయసుకు మించిన పాత్రలో అద్భుతంగా నటించింది.
ఈ పాత్రకు ఒప్పుకోవడంపై ఆశికా రంగనాథన్ అభినందించాల్సిందే. నాగార్జున-ఆశికా రంగనాథన్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీస్ ఆకట్టుకున్నాయి.
సెకండాఫ్‌లో అల్లరి నరేష్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంఎం కీరవాణి సంగీతం నచ్చుతుంది.
ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి.
మైనస్ పాయింట్లు
సినిమా కథాంశంలో కొత్తదనం లేదు. దర్శకుడు విజయ్ బిన్ని స్క్రీన్‌ప్లే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటే బాగుండేది.
రాజ్ తరుణ్, షబీర్, రుక్సార్ ధిల్లాన్ పోషించిన పాత్రలను మరింత బలంగా తీర్చిదిద్దితే.. స్టోరీ పవర్ ఫుల్‌గా ఉండేది.