NaaSaamiRanga:'నా సామిరంగ' థియేట్రికల్ ట్రైలర్.. పవర్ ఫుల్ గా నాగార్జున
కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాతలు ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ను చూస్తుంటే రొమాన్స్, వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సూపర్బ్ గా ఉంది. కింగ్ నాగ్ సరికొత్త అవతార్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.
నా సామి రంగ పై భారీ అంచనాలు
నరేష్, ఆషికా రంగనాథ్‌ల కాంబో సీన్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే అప్పుడే పండుగ వచ్చేసిందా అన్నట్లు ఉంది. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాతో నాగార్జున సంక్రాంతికి మళ్లీ పెద్ద హిట్ కొట్టనున్నట్లు కనిపిస్తోంది. మిర్నా మీనన్, రుక్సార్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.