Page Loader
Naa Saami Ranga: నా సామి రంగ థియేట్రికల్ డేట్ & టైం ఫిక్స్ 
Naa Saami Ranga: నా సామి రంగ థియేట్రికల్ డేట్ & టైం ఫిక్స్

Naa Saami Ranga: నా సామి రంగ థియేట్రికల్ డేట్ & టైం ఫిక్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2024
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

కింగ్ నాగార్జున తదుపరి చిత్రం నా సామి రంగ. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన గ్రామీణ యాక్షన్ డ్రామా జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కానుంది. నాగార్జునతో పాటు అల్లరి నరేష్,రాజ్ తరుణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక,టీమ్ నుండి పెద్ద అప్‌డేట్ వచ్చింది. నాసామి రంగ థియేట్రికల్ ట్రైలర్ జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 3:15 గంటలకు విడుదల కానుంది. దీనికి సంబంధించి నాగార్జున నటించిన మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు.

Details 

ఆషికా రంగనాథ్,మిర్నా మీనన్,రుక్సార్ ధిల్లాన్ కథానాయికలు

నిన్నటితో షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఆషికా రంగనాథ్,మిర్నా మీనన్,రుక్సార్ ధిల్లాన్ కథానాయికలు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. సోగ్గాడే చిన్ని నాయనా లాగా నా సామి రంగ హిట్ టాక్ సొంతం చేసుకుంటుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్