Page Loader
Kalki-2 : కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?
కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?

Kalki-2 : కల్కి-2 షూటింగ్‌పై నాగ్ అశ్విన్ క్లారిటీ.. ఎప్పటి నుంచో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి' ఫస్ట్ పార్ట్ ఘనవిజయం సాధించడంతో, సెకండ్ పార్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. మహాభారతం ఆధారంగా రూపొందుతున్న పాత్రల వల్ల ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఫ్యాన్స్ మాత్రం రెండో భాగం షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తెల్లవారు జామున ఆయన తన భార్య ప్రియాంకా దత్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా 'కల్కి-2' గురించి అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కొనసాగుతోంది.

Details

స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న కల్కి-2

సినిమాలోని పాత్రలపై ఇంకా పని జరుగుతోంది. సుమతి, అశ్వత్థామ పాత్రలను మహాభారతం నుంచి తీసుకున్నాం. ఆ పాత్రలను ప్రేక్షకులకు మరింత ఇంపాక్ట్ ఫుల్‌గా, ఎంగేజింగ్‌గా చూపించబోతున్నామని వివరించారు. తదుపరి షెడ్యూల్ గురించి మాట్లాడుతూ వీలైనంత త్వరగా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాం. ఈ ఏడాది చివరలో షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే విడుదలైన మొదటి భాగంలో కర్ణుడి పాత్రను ఎక్కువగా హైలైట్ చేయడంపై కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రెండో భాగంలో ప్రతి పాత్రకు సమగ్రత ఇచ్చేలా నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ పనుల్లో మరింత దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం 'కల్కి-2' స్క్రిప్ట్ పనుల్లో నాగ్ అశ్విన్ పూర్తిగా బిజీగా ఉన్నారు.