LOADING...
Nag Ashwin: నాగ్ అశ్విన్‌ పోస్ట్.. దీపికకు సంబంధించినదేనా?
నాగ్ అశ్విన్‌ పోస్ట్.. దీపికకు సంబంధించినదేనా?

Nag Ashwin: నాగ్ అశ్విన్‌ పోస్ట్.. దీపికకు సంబంధించినదేనా?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె తప్పించబడటం ప్రస్తుతం సినీ పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించి చర్చే కనబడుతోంది. ఈ క్రమంలో 'కల్కి 2898 AD' చిత్ర దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ చేసిన ఓ పోస్ట్‌ మరింత ఆసక్తిని రేపింది. ఆయన అందులో రాసిన క్యాప్షన్‌ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. నాగ్‌ అశ్విన్‌ తాజాగా 'కల్కి 2898 ఏడీ'లో కృష్ణుడి ప్రవేశ సన్నివేశాన్ని షేర్‌ చేశారు. ఆ వీడియోలో కృష్ణుడు అశ్వత్థామకు, ''కర్మను ఎవరూ తప్పించుకోలేరు.. ప్రతి వ్యక్తి తన కర్మను అనుభవించాల్సిందే'' అని చెప్పే డైలాగ్‌ ఉంది.

వివరాలు 

అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో చిన్న యుద్ధం 

దీనికి తోడు నాగ్‌ అశ్విన్‌ తన క్యాప్షన్‌లో,''గతంలో జరిగినది మార్చలేము.. కానీ తర్వాత ఏమి జరగాలో మాత్రం మనమే నిర్ణయించుకోవచ్చు'' అని రాశారు. దీంతో ఆయన ఈ పోస్ట్‌ను దీపిక పదుకొణెకు ఉద్దేశిస్తూ పెట్టారన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. దీపిక ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాకపోవడం పట్ల సోషల్‌ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధిక పారితోషికం కారణంగానే ఆమెను తప్పించారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయంపై అభిమానుల మధ్య సోషల్‌ మీడియాలో చిన్న యుద్ధమే జరుగుతోంది. దీపికకు మద్దతుగా ఆమె అభిమానులు వరుసగా పోస్ట్‌లు చేస్తుండగా, ప్రభాస్‌ అభిమానులు వారిని విమర్శిస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

వివరాలు 

దీపికా స్థానంలో ఎవరు?

ఈ మొత్తం పరిణామాలపై దీపిక స్పందిస్తుందా అన్నదే ఇప్పుడు అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. మరోవైపు 'కల్కి' సీక్వెల్‌లో ఆమె స్థానంలో ఎవరు కనిపిస్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. 'కల్కి'లో దీపిక సుమతి పాత్రలో నటించగా, రెండో భాగంలోనూ ఆ పాత్రకు కీలక ప్రాధాన్యం ఉన్నట్లు సమాచారం. అందువల్ల ఈ పాత్రకు న్యాయం చేయగల నటి ఎవరు అన్న దానిపై ఇప్పుడు చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్