Page Loader
Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా
స్ట్రీమింగ్ డేట్ తెలుసా

Nagachaitanya Dhootha : ఓటీటీలోకి నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 01, 2023
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య ధూత వెబ్‌సిరీస్ విషయంలో ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందింది. ఈ మేరకు ఓటీటీల్లోకి విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్త‌ి చేసుకుని చాలా కాల‌ం గడిచింది. అయినప్పటికీ రిలీజ్ డేట్‌పై ఇప్ప‌టివ‌ర‌కూ ఎటువంటి అప్‌డేట్ లేదు. తాజాగా ధూత సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిసెంబ‌ర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ వెబ్ సిరీస్ ఓటీటీల్లోకి రానున్న‌ట్లు సమాచారం. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హార్రర్ స్టోరీతో తెర‌కెక్కిన ఈ వెబ్ సిరీస్‌ టీజ‌ర్‌ను దీపావ‌ళి పండక్కి రిలీజ్ చేయ‌నున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఉన్న ఈ సిరీస్, ఆసాంతం రక్తికట్టించనుంది.ఈ సిరీస్ లో నాగ‌చైత‌న్య జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

details

చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబోలో ఇది మూడో ప్రాజెక్ట్

గ‌తంలో నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కే కుమార్ కాంబోలో మ‌నం, థాంక్యూ విడుదలయ్యాయి. అయితే తాజాగా ధూతతో కలిపి ఈ సంఖ్య మూడుకి చేరింది. మరోవైపు ధూతతోనే నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కే కుమార్ ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఇందులో భాగంగా పార్వ‌తి, ప్రియా భ‌వానీ శంక‌ర్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. చండేల్ వర్కింగ్ టైటిల్ : చైతన్య, చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నాడు. జీఏ-2 సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శరవేగంగా జ‌రుగుతోన్నాయి. గంగపుత్రులు(జాల‌ర్లు) జీవిత నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తుండగా, ఈ మూవీకి తాండేల్ పేరును వ‌ర్కింగ్ టైటిల్‌గా ప‌రిశీలిస్తున్నారు.