తదుపరి వార్తా కథనం

Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 08, 2024
01:54 pm
ఈ వార్తాకథనం ఏంటి
అక్కినేని ఇంట శుభకార్యం మొదలైంది. నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ జరిగింది.
ఈ రోజు ఉదయం 09.42 నిమిషాలకు ఈ శుభ కార్యక్రమం నిర్వహించినట్లు నాగార్జున ప్రకటించారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ గ్రాండ్‌గా సాగింది.
వాళ్లిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని అశీర్వదిస్తూ నాగార్జున ట్వీట్ చేశారు.
శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు ఎంతో ఉందని పేర్కొన్నారు.
Details
జీవితాంతం సంతోషంగా ఉండాలి : నాగార్జున
సంతోషకరమైన జంటకు అభినందనలు, వారికి జీవితాంతం ప్రేమ, సంతోషం కలగాలని కోరుకుంటున్నానని అని నాగార్జున ట్వీట్ చేశారు.
దేవుని ఆశీర్వాదం వాళ్లకు ఎళ్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఈ నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.