Naga Vamsi: 'ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు'.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
ఈ వార్తాకథనం ఏంటి
సినిమా ఇండస్ట్రీ బయట నుంచి చూస్తే ఎంతో కలర్‌ఫుల్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తుంది. కానీ తెర వెనుక నిర్మాతలు, దర్శకులు ఎదుర్కొనే ఒత్తిడి అంతా బయటకు కనిపించదని ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ అన్నారు. సినిమా ఫెయిల్యూర్‌ను తాను అంత సింపుల్‌గా తీసుకోలేనని, ముఖ్యంగా సినిమా రిలీజ్‌కు ముందు తీవ్ర ఒత్తిడికి గురవుతానని తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా నిర్మాణ సమయంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, మూవీ రిలీజ్ సమయంలో ఉండే టెన్షన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
వివరాలు
అవి క్లియర్ అయ్యే వరకు తీవ్ర ఆందోళన..
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూరేనని చెప్పారు.
సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోతే దాన్ని తాను అంత ఈజీగా అంగీకరించలేనన్నారు.
సినిమా ఫలితం నెగిటివ్‌గా వస్తే కొన్ని రోజుల పాటు తాను మానసికంగా తీవ్రంగా ప్రభావితమవుతానని తెలిపారు.
ముఖ్యంగా సినిమా రిలీజ్‌కు ముందు రోజు తనకు అసలు నిద్ర, తిండి ఉండవని నాగవంశీ చెప్పారు.
సినిమా విడుదలైన తర్వాత రెవెన్యూ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా క్లియర్ అయ్యే వరకు తీవ్ర ఆందోళన ఉంటుందని వెల్లడించారు.
బయటకు చూస్తే నిర్మాతలు చాలా ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తారని.. కానీ వారి మనసులో ఎలాంటి ఒత్తిడి ఉంటుందో ఎవరికీ తెలియదన్నారు.
వివరాలు
దర్శకుడి మనసులో మాత్రం ఎన్నో టెన్షన్స్..
తనతో కలిసి ప్రయాణించే ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు మాత్రమే తనపై ఉండే ఒత్తిడి ఎంత ఉంటుందో తెలుసని నాగవంశీ తెలిపారు.
వారితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుంటానని, తన ఆందోళనను తనకు దగ్గరగా ఉండేవారు మాత్రమే అర్థం చేసుకోగలరని చెప్పారు.
సినిమా రిలీజ్‌కు ముందు వారం రోజులు బయట ప్రపంచానికి అంతా ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందని.. కానీ నిర్మాత, దర్శకుడి మనసులో మాత్రం ఎన్నో టెన్షన్స్ ఉంటాయని నాగవంశీ అన్నారు.
బయట నుంచి కనిపించినంత గ్లామరస్‌గా సినిమా ఫీల్డ్ ఉండదని, ప్రతి సక్సెస్ వెనుక ఎంతో ఒత్తిడి ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.