Loading...
Nagarjuna: క్రిస్మస్‌కు 'కింగ్‌ 100'.. నాగార్జున వందో చిత్రానికి టైటిల్ ఖరారు..
క్రిస్మస్‌కు 'కింగ్‌ 100'.. నాగార్జున వందో చిత్రానికి టైటిల్ ఖరారు..

Nagarjuna: క్రిస్మస్‌కు 'కింగ్‌ 100'.. నాగార్జున వందో చిత్రానికి టైటిల్ ఖరారు..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 30, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న వందో చిత్రానికి 'కింగ్‌ 100' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రా. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం చిత్రబృందం సినిమా టైటిల్‌తో కూడిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.

వివరాలు

ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

'మనుషుల్లో రెండు రకాలు. డబ్బున్నోళ్లు, డబ్బు లేనోళ్లు. డబ్బు లేనప్పుడు నన్ను లూజర్‌ అన్నారు.

డబ్బు ఉన్నప్పుడు కింగ్‌ అని పిలిచారు...' అంటూ సాగే సంభాషణలు ప్రచార చిత్రంలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

డబ్బు కంటే మనిషికి లభించే గుర్తింపే ఎంతో శక్తిమంతమైనదని కథానాయకుడు నమ్ముతుంటాడు.

ఆ గుర్తింపును నిలబెట్టుకోవడం కోసం నిరంతరం పరుగెడుతూనే ఉండాలన్నది అతడు అనుసరించే మార్గంగా ప్రచార చిత్రం ద్వారా తెలుస్తోంది.

వివరాలు

డిసెంబరు నెలలోనే 'కింగ్‌ 100'..

యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్‌ అవతారంలో కనిపించనున్నారు.

డబ్బు, మోసాల చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.

ప్రచార చిత్రంతోపాటు సినిమా విడుదల తేదీని కూడా చిత్రబృందం ప్రకటించింది.

నాగార్జునకు బాగా కలిసొచ్చిన డిసెంబరు నెలలోనే 'కింగ్‌ 100' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ADVERTISEMENT