
Captain Miller: ధనుష్ కోసం నాగార్జున,వెంకటేష్
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు అరుణ్ మాతేశ్వర్ తెరకెక్కించిన పీరియాడిక్ సాలిడ్ యాక్షన్ డ్రామా "కెప్టెన్ మిల్లర్".
తమిళ్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించిన ఈ మూవీ జనవరి 25న తెలుగులో రిలీజ్ కానుంది.
ఏషియన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగాఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.
తాజా సమాచారం ప్రకారం,ఈ మూవీ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గం. లకు విడుదల చేయనున్నారు.
Details
ట్రైలర్ విడుదలకు టాలీవుడ్ అగ్రహీరోలు
ఈ ట్రైలర్ ని టాలీవుడ్ అగ్రహీరోలు విక్టరీ వెంకటేష్, నాగార్జున విడుదల చెయ్యనున్నారు.
సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై సెంథిల్ త్యాగరాజ్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, నివేదిత సతీష్, జాన్ కొక్కెన్, విజయకన్, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఏషియన్ సినిమాస్ చేసిన ట్వీట్
Our own Favourites King @iamnagarjuna Garu and Victory @VenkyMama Garu will be Releasing the Telugu Trailer of #CaptainMiller Today At 6PM 💥🎶
— Asian Cinemas (@AsianCinemas_) January 17, 2024
Telugu Release by @AsianCinemas_ and @SureshProdns On Jan 25th🔥@dhanushkraja #ArunMatheswaran @sundeepkishan @NimmaShivanna pic.twitter.com/MRFXz7DFwd