Page Loader
Geethu Royal: హోస్ట్‌గా నాగార్జున్ ఫెయిల్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్
హోస్ట్‌గా నాగార్జున్ ఫెయిల్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్

Geethu Royal: హోస్ట్‌గా నాగార్జున్ ఫెయిల్.. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 27, 2023
06:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్ బాస్ తెలుగుకు గత ఐదు సీజన్లుగా నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. వారాంతంలో వచ్చి కంటెస్టెంట్స్ గేమ్, ప్రవర్తనను సమీక్షించడం, తప్పు ఒప్పులు చెప్పడం హోస్ట్ బాధ్యత. అయితే తప్పు చేసిన వారిని సమర్థించి ఇన్నోసెంట్స్ ని నాగార్జున టార్గెట్ చేస్తున్నారని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. పలు సందర్భాల్లో నాగార్జున రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చారంటూ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. నాగార్జున హోస్టింగ్ సీజన్ సిక్స్ వరకు చప్పగా సాగిందని, అయితే ఈ సీజన్ లో బాగుందని ఆమె చెప్పారు.

Details

నాగార్జున షో చూడరు : గీతూ రాయల్ 

హోస్ట్‌గా నాగార్జున వేస్ట్ అని ఆయన తప్పు చేసిన వారి బెండు తీయడని, తలతిక్కగా ఉన్న వారి స్క్రూలు టైట్ చేయరని గీతూ రాయల్ పేర్కొంది. నాగార్జున షో చూడరని, బిగ్ బాస్ నిర్వహకులు ఇచ్చే స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నారు అంటూ అసలు విషయం బయటపెట్టారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున చేయలేని పనిని నేను బజ్ కార్యక్రమంలో తాను చేస్తున్నానని చెప్పింది. ప్రస్తుతం గీతూ రాయల్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.