LOADING...
Lenin: 'లెనిన్'లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నాగార్జున!.. అఖిల్ హిట్ సాధిస్తాడా?
'లెనిన్'లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నాగార్జున!.. అఖిల్ హిట్ సాధిస్తాడా?

Lenin: 'లెనిన్'లో పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నాగార్జున!.. అఖిల్ హిట్ సాధిస్తాడా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరోగా ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా ఒక్క హిట్ అందించలేకపోయిన అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఈసారి ప్రత్యేక వ్యూహంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూడో తరం వారసుడిగా సినీప్రపంచంలో అడుగుపెట్టినా, అభిమానులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 'ఏజెంట్' సినిమా డిజాస్టర్ తర్వాత విమర్శలు తీవ్రంగా ఎదుర్కొన్నారు. అయితే ఆ విమర్శలను పక్కన పెట్టి, అఖిల్ గ్యాప్ తీసుకుని పక్కా మాస్, మసాలా కథను ఎంచుకొని 'లెనిన్'తో విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంతో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో రూపొందించే ఈ చిత్రం, అభిమానుల అంచనాలను మరింత పెంచింది.

Details

తండ్రి పాత్రలో నాగార్జున?

అయితే ఈ సినిమాలో అఖిల్ తండ్రి పాత్రలో అక్కినేని నాగార్జున నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ అభిప్రాయం ప్రకారం, పవర్‌ఫుల్‌గా సాగే ఈ పాత్రకు నాగార్జున పరిపూర్ణంగా సరిపోతారు. ఇప్పటి వరకు సినిమా 80శాతం పూర్తి అయింది. చివరి షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అదనంగా క్లైమాక్స్ సీన్‌లో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ ఉండనుంది. ఈ పాత్రలో ఒక సీనియర్ హీరో కనిపిస్తాడని టాక్ ఉంది. క్లైమాక్స్ మొత్తం పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నిండి ఉంటుంది. అయితే ఆ సీనియర్ హీరో ఎవరు అనేది ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.