LOADING...
Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున.. 
అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున..

Nagarjuna : అక్కినేని అఖిల్ తండ్రి కాబోతున్నాడా? స్పందించిన నాగార్జున.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

నాగార్జున రెండో కుమారుడు, స్టార్ హీరో అక్కినేని అఖిల్, జూన్‌లో తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట అప్పుడప్పుడు వెకేషన్ కి వెళ్తూ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తూ ఉంటారు. అఖిల్-జైనబ్ జంట ఫొటోలు పెళ్లి వేడుకల సమయంలోనూ, తర్వాత వెకేషన్‌ ట్రిప్స్ నుండి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే కొన్ని రోజుల క్రితం జైనబ్‌ రవ్జీ ప్రగ్నెంట్ అయింది, తల్లి కాబోతుందని, అఖిల్ తండ్రి కాబోతున్నాడని వార్తలు వచ్చాయి.

వివరాలు 

తండ్రి నుంచి తాత గా ప్రమోట్ అవుతున్నారా..? 

ఈ వార్తలపై అఖిల్ గానీ, అక్కినేని కుటుంబం గానీ ఎలాంటి అధికారిక వ్యాఖ్య చేయలేదు. అయితే తాజాగా నాగార్జున ఈ విషయం గురించి స్పందించారు. నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్ కి వెళ్లగా అక్కడ ఓ విలేఖరి.. మీరు తండ్రి నుంచి తాత గా ప్రమోట్ అవుతున్నారా అది నిజమేనా? సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అని అడిగారు. దీనికి నాగార్జున నవ్వేసి.. "సరైన సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను" అని మాత్రమే చెప్పాడు. ఆయన వార్తలను పూర్తిగా ఖండించలేదు, కాబట్టి అఖిల్ తండ్రి కావబోతున్నాడా అనే ఊహాలు మరింత బలపడుతున్నాయి.

Advertisement