
Nagarjuna: నాగార్జున నిజంగానే కొట్టారు.. మొహం మొత్తం కందిపోయింది.. ఇషా కొప్పికర్ సంచలన కామెంట్స్!
ఈ వార్తాకథనం ఏంటి
1998లో విడుదలైన నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ నటించిన చిత్రం 'చంద్రలేఖ' మ్యూజికల్ హిట్‌గా గుర్తింపు పొందింది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఓ మదుర జ్ఞాపకాన్ని ఇషా కొప్పికర్ తాజాగా పంచుకున్నారు. సినిమా చిత్రీకరణ సమయంలో నాగార్జున చెంపదెబ్బలు కొట్టిన ఘటనను వెల్లడించారు. 'చంద్రలేఖ' నా రెండో సినిమా. ఇందులో నాగార్జున కోపంగా నన్ను కొట్టే సన్నివేశం ఉంది. ఆ సీన్ బాగా రావాలంటే నిజంగా కొట్టాల్సిందేనని నేను భావించాను. అందుకే ఆయన్ను నిజంగానే కొట్టమని చెప్పాను. మొదట ఆయన లైట్‌గా కొట్టారు. సీన్‌లో అవసరమైన భావం రాలేదు. వెంటనే 'నాకు కోపం రావడం లేదు. మీరు గట్టిగా కొట్టండి' అని చెప్పారు.
Details
వెంటనే క్షమాపణ చెప్పారు
తదుపరి రీటేక్‌లు తీసుకుంటూ మొత్తం 14, 15 సార్లు గట్టిగా నా చెంపపై కొట్టారు. చివరికి సన్నివేశం అద్భుతంగా వచ్చిందుగానీ.. సీన్ తర్వాత నా మొహం మొత్తం కందిపోయింది. చెంప మీద వాతలు వచ్చాయి. ఈ ఘటన చూసిన నాగార్జున వెంటనే క్షమాపణలు చెప్పారు. అయితే నేను, 'సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటి విషయాలు సహజం' అంటూ వారిని ఆపేశానని తెలిపారు. ఇషా కొప్పికర్. 1997లో 'వరప్రసాద్' అనే చిత్రంలో అతిథి పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఇషా, రెండో సినిమాగా 'చంద్రలేఖ'లో నాగార్జున సరసన నటించారు. ఆ తర్వాత ఆమె హిందీ, తమిళం, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లోనూ వరుస ప్రాజెక్టుల ద్వారా దూసుకుపోయింది.