NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  
    తదుపరి వార్తా కథనం
    Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  
    'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య

    Naga Chaitanya-Sobhita: 'నా పెళ్లి ఆలా చెయ్యండి' నాగార్జునని కోరిన నాగచైతన్య  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 22, 2024
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హీరో నాగ చైతన్య ,నటి శోభితా ధూళిపాళ్ల పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.

    ఈ విషయాన్ని నాగార్జున ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. నాగచైతన్య తన పెళ్లి వేడుకను చాలా సింపుల్‌గా జరిపించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

    "ఈ సంవత్సరం మా నాన్నగారి శతజయంతి సంవత్సరం కావడంతో అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభితల పెళ్లి జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం ఓ స్టూడియో మాత్రమే కాదు, మా కుటుంబ వారసత్వంలో ఒక భాగం. మా నాన్నగారి ఇష్టమైన ప్రదేశం ఇది. చైతన్య పెళ్లిని సాదాసీదాగా చేయాలని కోరాడు.ఈ వేడుకకు 300 మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులను ఆహ్వానించడానికి ఆలోచిస్తున్నాం.

    వివరాలు 

    నాకు పెళ్లి మంత్రాలు వినడం చాలా ఇష్టం: నాగార్జున 

    పెళ్లి సెట్ స్టూడియోలో సుందరంగా తీర్చిదిద్దబడినది. పెళ్లి పనులు కూడా వాళ్లిద్దరే చేసుకుంటామన్నారు. స్టూడియోలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రతీ సంవత్సరం ఇక్కడ కనీసం 10 పెళ్లిళ్లు జరుగుతుంటాయి. శోభిత తల్లిదండ్రులు సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించాలని కోరారు. నాకు కూడా ఆ మంత్రాల వినడం చాలా ఇష్టం. అవి వింటున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాగచైతన్య, శోభితల పెళ్లి తెలుగు సంప్రదాయం ప్రకారం జరగనుంది. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రిసెప్షన్ వివరాలు త్వరలో తెలియజేస్తాం" అని నాగార్జున పేర్కొన్నారు.

    వివరాలు 

    డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత పెళ్లి

    "గూఢచారి" సినిమాతో శోభితా ధూళిపాళ్లను అభినందించాను. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమెను కలవమని ఆహ్వానించాను. శోభిత తన సినీ ప్రయాణంతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. వైజాగ్ నుండి వచ్చి, ఈ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సాధించింది. ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడింది. చాలా గొప్ప నటి, ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి. నాగచైతన్య, శోభితని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది" అని నాగార్జున శోభితపై ప్రశంసలు అందించారు.

    డిసెంబర్ 4న రాత్రి 8:13 నిమిషాలకు నాగచైతన్య, శోభిత పెళ్లి బంధంతో ఒక్కటవుతారు. వీరి పెళ్లి కార్డూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జున
    నాగ చైతన్య

    తాజా

    Health insurance: హెల్త్‌ బీమా సరిపోతుందా?.. 80శాతం పాలసీదారుల్లో ఆందోళన ఆరోగ్య బీమా
    Ceasefire: పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదు : రక్షణ శాఖ భారతదేశం
    Surya : సూర్య అభిమానులకు శుభవార్త.. 'రెట్రో' ఓటీటీ విడుదల తేదీ లీక్? సూర్య
    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా

    నాగార్జున

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  తెలుగు సినిమా
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ 7
    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం  తెలుగు సినిమా

    నాగ చైతన్య

    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025