LOADING...
Nagarjuna : నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో
నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో

Nagarjuna : నాగార్జున 100వ చిత్రంలో టబు ఎంట్రీ.. 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కాంబో

వ్రాసిన వారు Moogati Shabari
Apr 28, 2026
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ హీరో నాగార్జునతో మరోసారి టబు జోడీ కట్టనున్నారు. అక్కినేని నాగార్జున సినీ ప్రయాణంలో ప్రత్యేక స్థానం దక్కించుకోబోతున్న 100వ చిత్రంలో సీనియర్ నటి టబు నటిస్తున్నారనే వార్తలకు ఆమె స్వయంగా ధృవీకరణ ఇచ్చారు. నాగ్ సినిమాలో భాగమవుతున్నట్లు అధికారికంగా ఆమె వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలో మూవీ క్లాప్‌బోర్డు ఫొటోను పంచుకుని వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. చిత్రబృందం షూటింగ్‌ను ఎంతో రహస్యంగా కొనసాగిస్తుండగా, టబు చేసిన పోస్టుతో ఈ విషయం మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు

కొత్త లుక్‌లో దర్శనమిస్తున్న నాగ్..

టబు పోస్టుకు దర్శకుడు రా. కార్తీక్ స్పందిస్తూ, "మేడమ్, మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది" అని కామెంట్ చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

వివరాలు

నాగ్ సరసన ముగ్గురు హీరోయిన్స్

దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన 'నిన్నే పెళ్లాడతా' చిత్రంలో నాగార్జున, టబు జంట ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్‌లో హిట్ జోడీగా గుర్తింపు పొందింది. అనంతరం 'ఆవిడా మా ఆవిడే' సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. ఇంతకాలం విరామం తర్వాత ఈ జంట మరోసారి తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ఈ సినిమాలో టబు నాగార్జున సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారా లేదా మరో కీలక పాత్రలో కనిపించనున్నారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలు ఉంటారనే ప్రచారం కూడా సాగుతోంది.

Advertisement