Vikram Nakshatram : మళ్లీ వాయిదా పడ్డ నక్షత్రం..స్వయంగా వెల్లడించిన గౌతమ్ మీనన్
కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధృవ నక్షత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు దర్శక, నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ వెల్లడించారు. సారీ.. ధృవ నక్షత్రం చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురాలేకపోయామన్నారు. మా బెస్ట్ ప్రయత్నించామని, కానీ, మాకు ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలన్నారు. ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని కలిగిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి సినిమా వాయిదా పడటం పట్ల విక్రమ్ అభిమానులు, ప్రేక్షకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. రీతూ వర్మ,పార్థిబాన్, రాధికా శరత్ కుమార్, సిమ్రాన్, వినాయకన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా హరీష్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చారు.