
Court: ఓటీటీలోకి 'కోర్ట్' .. అధికారికంగా ప్రకటించిన నెట్ ఫ్లిక్స్ సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రాల్లో 'కోర్ట్' సినిమా ఒకటి.
విడుదలైన వెంటనే విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.
చివరికి నెట్ ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది.
నటుడు నాని సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. ఇందులో హర్ష్ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
వివరాలు
కథ విషయానికి వస్తే:
ఈ కథ 2013 సంవత్సరం నేపథ్యంలో సాగుతుంది.చంద్రశేఖర్ అనే యువకుడు,చందు (రోషన్) ఇంటర్‌లో ఫెయిల్ అయిన తర్వాత జీవనోపాధి కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఉపాధి పొందుతుంటాడు.
వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కుమారుడైన చందు... ఇంటర్మీడియట్ చదువుతోన్న ఓ ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయి, జాబిలి (శ్రీదేవి)తో ప్రేమలో పడతాడు.
ఈ విషయం జాబిలి కుటుంబానికి తెలిసిపోయిన తర్వాత,తమ ఇంటి గౌరవం,పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె బంధువు మంగపతి (శివాజీ) తీవ్రమైన చర్యలు తీసుకుంటాడు.
ఏ విషయాన్ని విచారించకుండా, చందుపై పోక్సో చట్టంతో పాటు, పలు తీవ్ర నేర విభాగాల కింద కేసు పెట్టిస్తాడు.
వివరాలు
న్యాయపోరాటంలో తేజకు విజయం లభించిందా..
తాను ఏ తప్పూ చేయనప్పటికీ,చందు జీవితాన్ని ఈ కేసు ఏ విధంగా తలకిందులుగా మార్చింది?
ప్రముఖ న్యాయవాది మోహన్‌రావు (సాయికుమార్) వద్ద జూనియర్ లాయర్‌గా పనిచేస్తున్న సూర్యతేజ అలియాస్ తేజ (ప్రియదర్శి) ఈ కేసును ఎలా తీసుకున్నాడు?
న్యాయపోరాటంలో తేజకు విజయం లభించిందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే, ఈ సినిమాను ఓటీటీలో తప్పక చూడాలి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్ ఫ్లిక్స్ అధికారిక ప్రకటన
#CourtStateVsANobody Streaming From APRIL 11th On NETFLIX⚖️💥
— OTT STREAM UPDATES (@newottupdates) April 6, 2025
50CRS+ Grosser at WORLDWIDE BoxOffice🔥💥
Coming In Multiple Audios🤘😎
Produced By #Nani ⭐ #Priyadarshan#CourtStateVsNobodyOnNetflix#CourtOnNetflix https://t.co/Egj4O70WuB pic.twitter.com/BNzQLpvJ6T