NANI : నాని ఫ్యాన్స్‌కు షాక్.. 'బ్లడీ రోమియో' వాయిదా.. పవర్ స్టార్ సినిమాపైనే సుజీత్ ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
నాని అభిమానులకు నిరాశ కలిగించే వార్త ఒకటి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన చేయనున్న క్రేజీ యాక్షన్ ప్రాజెక్ట్ 'బ్లడీ రోమియో' సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సుజీత్, సీబీ చక్రవర్తి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లతో ఆయన భారీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టాడు. వీటిలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో 'బ్లడీ రోమియో' ఒకటి. అయితే ఈ సినిమా ఆలస్యానికి ప్రధాన కారణంగా 'ది పారడైజ్' మూవీ షూటింగ్‌లో ఏర్పడిన జాప్యం అనే టాక్ వినిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
వివరాలు
మరింత ఆలస్యంగా బ్లడీ రోమియో షూట్..
మొదట ఈ సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని భావించిన మేకర్స్, సినిమా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని 2026 ఆగస్టు 21కు మార్చారు. దీంతో ప్రస్తుతం నాని తన పూర్తి సమయాన్ని 'ది పారడైజ్' షూటింగ్‌కే కేటాయించాల్సి వస్తోంది. ఈ కారణంగా సుజీత్ దర్శకత్వంలో రూపొందాల్సిన 'బ్లడీ రోమియో' ప్రారంభం మరింత ఆలస్యమవుతున్నట్టు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో లేదా 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
వివరాలు
పవర్ స్టార్ మూవీపైనే సుజీత్ ఫోకస్..
ఇక 'బ్లడీ రోమియో' ఆలస్యం కావడంతో దర్శకుడు సుజీత్ తన దృష్టిని మరో భారీ ప్రాజెక్ట్ అయిన పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'OG 2'పై కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. 'OG' సినిమాపై ఉన్న భారీ హైప్‌ను దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్ కథను మరింత స్ట్రాంగ్ యాక్షన్ అంశాలతో రూపొందించే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నారని సమాచారం. ప్రస్తుతం 'OG 2' స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనులు కొనసాగుతున్నాయని, నాని డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 'బ్లడీ రోమియో'ను ప్రారంభించేలా ప్లానింగ్ జరుగుతోందని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.