Loading...
Tollywood: కొత్త లుక్‌లో నారా రోహిత్‌... 'సౌండ్‌ ఇంజినీర్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజ్
కొత్త లుక్‌లో నారా రోహిత్‌... 'సౌండ్‌ ఇంజినీర్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజ్

Tollywood: కొత్త లుక్‌లో నారా రోహిత్‌... 'సౌండ్‌ ఇంజినీర్‌' ఫస్ట్‌లుక్‌ రిలీజ్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 26, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న కథానాయకుడు నారా రోహిత్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నయన్‌ సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'సౌండ్‌ ఇంజినీర్‌' అనే పేరు ఖరారు చేశారు. చినిమిల్లి మణికుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా, భరత్‌ చౌదరి చెరుకూరి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నారా రోహిత్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని చిత్రబృందం కాన్సెప్ట్‌ వీడియోతో పాటు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో రోహిత్‌ పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించడంతో పాటు, ఆయన పాత్ర వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా రూపొందించినట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో నరేశ్‌ వీకే, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, రోహిణి, సంపత్‌, అజయ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

వివరాలు

ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు 'అమీర్‌ లోగ్‌'..

హైదరాబాద్‌ సంస్కృతి, అక్కడి ప్రజల జీవనశైలిపై మరింత అభిమానం పెంచేలా 'అమీర్‌ లోగ్‌' చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు రమణారెడ్డి సోమ తెలిపారు.

ఆయన దర్శకత్వంలో ఎమ్‌.సి. హరి, మనోజ్‌, శశిధర్‌, వేద జలంధర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మాధవిరెడ్డి సోమ నిర్మించారు.

సినిమాను రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్‌ మీడియా సంస్థ ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల తేదీని వెల్లడించడంతో పాటు 'అవ్వల్‌ దావత్‌' పాటను ఆవిష్కరించారు.

వివరాలు

హాస్యం, భావోద్వేగాలతో 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'

పవన్‌ మహావీర్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం 'అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి'. ఇందులో వర్షిక, సుహానా కథానాయికలుగా నటించారు.

శివాల ప్రభాకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శైలజ రెడ్డి నిర్మించారు.

సినిమా ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్‌. ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హీరో పవన్‌ మహావీర్‌ మాట్లాడుతూ, ''ఒక యువకుడు, ఇద్దరు యువతుల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో హాస్యంతో పాటు భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది.

అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయి'' అని తెలిపారు.

ADVERTISEMENT