LOADING...
Anaganaga Oka Raju: నవ్విస్తున్న 'అనగనగా ఒక రాజు' ట్రైలర్

Anaganaga Oka Raju: నవ్విస్తున్న 'అనగనగా ఒక రాజు' ట్రైలర్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ న‌టుడు నవీన్ పొలిశెట్టి తన కామెడీతో మ‌రోసారి థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు. సంక్రాంతి రేసులో నిలిచిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'అనగనగా ఒక రాజు' థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు (జనవరి 8న) అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ సినిమా సంక్రాంతి ప్రత్యేకతగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ని చూసినప్పటి నుంచే, నవీన్ పొలిశెట్టి తన కామెడీ పవర్‌ను మరోసారి బాక్సాఫీస్ వద్ద పక్కాగా చూపించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా,కింగ్ అక్కినేని నాగార్జున ఈ ట్రైలర్‌కు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక పెద్ద సర్ప్రైజ్‌గా నిలిచింది. రాజు పాత్ర కోసం బంగార్రాజు రంగంలోకి దిగినట్లు ఆయన బేస్ వాయిస్,ట్రైలర్‌కు అదనపు ఉత్సాహాన్ని,ఆకర్షణను చేర్చింది.

వివరాలు 

సినిమా మీద అంచనాలు 

గోదావరి జిల్లాను నేపథ్యంగా పెట్టుకుని,పెళ్లి చుట్టూ సృష్టించిన గందరగోళం,హుషారైన డైలాగ్స్‌తో ట్రైలర్ మొత్తం వినోదభరితంగా సాగింది. నవీన్ ఎనర్జీకి తోడు,హీరోయిన్ మీనాక్షి చౌదరి అందం కూడా సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. మరోవైపు,ఈ ఏడాది సంక్రాంతి సమరంలో రసవత్తర పోటీ ముందే కనిపిస్తోంది.ప్రభాస్ 'ది రాజా సాబ్', చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'వంటి భారీచిత్రాల మధ్య,'అనగనగా ఒక రాజు' జనవరి 14న తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 'జాతి రత్నాలు' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత,నవీన్ పూర్తి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకులను వినోదపరచబోతున్నాడు. ఈచిత్రానికి మారి దర్శకత్వం వహించగా,మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందించారు. అలాగే,సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సమస్త చేసిన ట్వీట్ 

Advertisement