Page Loader
Naveen Polishetty: రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు? 
Naveen Polishetty: రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు?

Naveen Polishetty: రోడ్డు ప్రమాదంలో హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 28, 2024
12:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అమెరికాలో బైక్ ప్రమాదానికి గురయ్యారు. బైక్ మీద నుంచి జారి పడటంతో చేతికి ఫ్రాక్చర్ అయ్యిందని,ప్రస్తుతం కోలుకుంటున్నాడని నటుడి బృందం హిందూస్తాన్ టైమ్స్‌కి ధృవీకరించింది. నవీన్ కి దాదాపు రెండు నెలలు వరకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారట.అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఈఘటన జరిగి రెండ్రోజులు అవుతోంది అంటున్నారు. నవీన్ చివరిగా 2023లో విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో కనిపించారు.దీనికి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. ఈసినిమాలో నవీన్ సరసన అనుష్క శెట్టి నటించారు.ఈచిత్రంలో నవీన్ నటనకు మంచి ప్రశంసలు అందుకున్నాడు. శ్రీలీలతో కలిసి నవీన్ అనగనగా ఒక రాజు కోసం సినిమా చేస్తున్నాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హీరో నవీన్ పొలిశెట్టికి గాయాలు?