ముంబైలో తళుక్కుమన్న నయనతార.. బాలీవుడ్‌కూ ప్రాధాన్యత ఇస్తానన్న బ్యూటీ
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాది ప్రముఖ సినీనటి నయనతార శుక్రవారం ముంబైలో మెరిశారు. జవాన్ చిత్రం సక్సెస్ మీట్ లో భాగంగా ఈ టాప్ హీరోయిన్ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.
భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి ముంబైలోని ఓ థియేటర్‌లో చిత్రాన్ని ఆమె వీక్షించారు. ఈ క్రమంలోనే అభిమానులు ఆమెను ఘనంగా స్వాగతించారు.
సినిమా అనంతరం మీడియాతో మాట్లాడిన నయనతార దక్షిణాదితో పాటు బాలీవుడ్‌కు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అంతకుముందు బాలీవుడ్ అరంగేట్రానికి సమయం ఎక్కువగా తీసుకున్నారని విలేకరులు అడగగా, దేనికైనా సమయం రావాలని చెప్పారు.
ఆలస్యంగానైనా తన అభిమాన హీరో షారుఖ్ ఖాన్ సరసన కథనాయికగా నటించి హిందీలో అర్రంగేట్రం చేయడం పట్ల నయనతార హర్షం వ్యక్తం చేశారు.
DETAILS
ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతున్న జవాన్
భవిష్యత్ లో బాలీవుడ్ సినిమాలకు దక్షిణాది సినిమాలతో సమానంగా చూస్తానని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 7 భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన జవాన్, దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీసులను కొల్లగొడుతోంది.
ఇండియాలో ఒక్కరోజులే దాదాపు రూ.75 కోట్ల మేర భారీ వసూళ్లను జవాన్ చిత్రం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు సాధించి పాత రికార్డులను చెరిపేస్తున్నట్లు సమాచారం.
షారుక్ హీరోగా జవాన్ చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి నయనతార తొలిసారిగా అడుగుపెట్టడం విశేషం. ఈ చిత్రంలో నయనతార అందం, అభినయానికిగానూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ నుంచి ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.