NAYANTARA : సమంతకు నయనతార స్పెషల్ గిఫ్ట్.. బాక్సులో ఏమున్నాయో తెలుసా
లేడీ మెగాస్టార్ హోదా తెచ్చుకున్న క్రేజీ స్టార్ నయనతార, మరో స్టార్ హీరోయిన్ సమంతకు ఓ అదిరిపోయే గిఫ్ట్ అందించింది. ఇటీవలే నయన్ ఓ బిజినెస్ ప్రారంభించింది. '9 స్కిన్' అనే కాస్మెటిక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతివల సౌందర్యాన్ని మిలమిల మెరిపించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తన '9 స్కిన్' సంస్థ నుంచి సమంతకి పేస్ క్రీం ప్రోడక్ట్స్ ని బహుమతిగా పంపించింది నయన్. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో స్టేటస్ రూపంలో షేర్ చేసింది. ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించేందుకు ఆసక్తిగా ఉన్నానని బదులిచ్చింది. 9 స్కిన్ ఉత్పత్తులకు అల్ ది వెరీ బెస్ట్ నయనతార అంటూ ప్రశంసించింది. ప్రస్తుతం నెట్టింట సమంతా పోస్ట్ వైరల్ అయ్యింది.