RAKKAYIE: నయనతార బర్త్‌డే స్పెషల్ వచ్చేసింది.. ఐదు బాషలలో కొత్త సినిమా ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
నయనతార బర్త్ డే సందర్భంగా, ఆమె కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది.
ముందుగా, "ఆమె యుద్ధం ప్రకటించింది" అనే క్యాప్షన్‌తో ఒక పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పోస్టర్ గురించి నయనతార ఫ్యాన్స్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు, అది ధనుష్‌కు హెచ్చరికలా ఉందని పేర్కొన్నారు. దీనిపై ధనుష్ అభిమానులు కౌంటర్లు ఇచ్చారు.
తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ పేరే 'రక్కాయీ'. సెంథిల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్‌లో నయనతారను ఒక బిడ్డ తల్లిగా చూపించారు.
వివరాలు
భయంకర విలన్లపై నయన్ ఊచకోత
టీజర్ కథనం ప్రకారం, నయనతార గుడిసెలో ఉంటారు. ఆమెను చంపేందుకు రౌడీ మూకలు వస్తాయి.
ఆ సమయంలో గుడిసెలో బిడ్డ ఊయల్లో ఏడుస్తూ ఉంటుంది. ఆమె మిరపకాయలను రోకలిలో దంచి, బిడ్డకు పాలు పట్టి, ఒక కొడవలిని వెదురు కర్రకు కట్టి బయటకు వస్తుంది.
ఆ రౌడీలపై ధైర్యంగా ఎదురుదాడి చేసి వారిని చిత్తు చేస్తుంది.ఈ టీజర్ గోవింద్ వసంత సంగీతం, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది.
నయనతార లుక్స్ కూడా గట్టిదనాన్ని ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి.
టీజర్‌ను చూస్తే ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అనిపిస్తోంది.డ్రమ్ స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీవెర్స్ ఇండియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
టీజర్‌ను బట్టి చూస్తే,'రక్కాయీ'గా నయనతార ఒక పెద్ద లక్ష్యాన్ని సాధించాలని సిద్ధమైందని స్పష్టంగా అర్థమవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నయనతార చేసిన ట్వీట్
#Rakkayie for you all🎥 She declares War🔥 pic.twitter.com/73BIOU4Ulw
— Nayanthara✨ (@NayantharaU) November 18, 2024