Nayanthara-Dhanush: డాక్యుమెంటరీలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు.. ధనుష్ దావాపై స్పందించిన నయనతార
నటి నయనతార (Nayanthara) ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై ధనుష్ (Dhanush) కేసు వేసిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి, నయనతార తరఫు లాయర్ స్పందించారు. "నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీలో ఎలాంటి కాపీరైట్ ఉల్లంఘన చోటు చేసుకోలేదు అని స్పష్టం చేశారు. డాక్యుమెంటరీలో "నానుమ్ రౌడీ దాన్" (Naanum Rowdy Dhaan) చిత్రంలోని విజువల్స్‌ను పర్మిషన్ లేకుండా ఉపయోగించడాన్ని ఆధారంగా పెట్టుకుని ధనుష్ నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయనతార,ఆమె భర్తకు చెందిన రౌడీ పిక్చర్స్‌పై డిఫాండెంట్‌గా కేసు వేసింది.
తదుపరి విచారణ డిసెంబర్ 2
దీనిపై నయనతార లాయర్ వివరణ ఇచ్చారు: "డాక్యుమెంటరీలో ఉపయోగించిన విజువల్స్ సినిమా నుండి తీసుకోబడలేదు. అవి 'బీటీఎస్' (Behind the Scenes)నుండి తీసుకున్నవి, ఇవి నయనతార వ్యక్తిగత లైబ్రరీ భాగం. కాబట్టి ఇది కాపీరైట్ ఉల్లంఘనకు చెందదు" అని అన్నారు. ఈ కేసు గురించి తదుపరి విచారణ మద్రాస్ హైకోర్టులో డిసెంబర్ 2న జరగనుంది. ధనుష్ "నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్" డాక్యుమెంటరీలో "నానుమ్ రౌడీ దాన్" చిత్రానికి సంబంధించిన ఫుటేజ్‌ను ఉపయోగించినట్లు ఆరోపించారు. ఆ కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో,నయనతార ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. తాము డాక్యుమెంటరీ ట్రైలర్‌లో మూడు సెకన్ల సీన్స్‌ను ఉపయోగించినందుకు ధనుష్ రూ.10కోట్లు పరిహారం కోరారని ఆమె తెలిపారు.
ధనుష్ తనపై ద్వేషం చూపిస్తున్నారు: నయనతార
ఈ వివాదంపై నయనతార తన వ్యాఖ్యల్లో, ధనుష్ తనపై ద్వేషం చూపిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్‌లో వివాదాస్పదంగా మారి, పలువురు సినీ ప్రముఖులు నయనతారకు మద్దతు ప్రకటించారు.