Page Loader
Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్' 
నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్'

Nayanathara Brithday: నయనతార పుట్టిన రోజు.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న 'లేడీ సూపర్ స్టార్' 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2024
11:49 am

ఈ వార్తాకథనం ఏంటి

కెరీర్‌లో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నయనతార, ఇప్పటికీ టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తూనే ఉంది. సుదీర్ఘమైన నట జీవితంలో 75 చిత్రాలను పూర్తి చేసి, ప్రస్తుతం మరో నాలుగు ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ఇవాళ ఆమె 40వ పుట్టిన రోజు సందర్భంగా, ఆమె జీవితం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది. సినిమాలు చాలా ఇష్టమైనప్పటికీ, తొలి దశలో నటనపై ఆసక్తి లేకపోయినా మలయాళ సినిమాలు చేసి నటనలో స్థిరపడింది. ఒకవేళ తనకు నటిగా అవకాశం లేకపోయి ఉంటే నృత్య కళాకారిణి గానీ, లేదా చార్ట్డ్ అకౌంటెంట్ లో చేసి ఉంటానని చెప్పింది. ఇప్పటివరకు తన మనసుకు నచ్చిన పాత్రలను మాత్రమే పోషించిన నయనతార, డబ్బు కోసం రొటీన్ రోల్స్ చేయట్లేదు.

Details

రోటిన్ పాత్రలకు దూరంగా నయనతార

తమిళ్ 'బిల్లా' చిత్రంలో బికినీ ధరించి నటించినప్పటికీ, అదే పాత్రను తెలుగు 'బిల్లా'లో చేసేందుకు ఆమె నిరాకరించింది. సినీ పరిశ్రమలో గ్లామర్ అనేది మేకప్, దుస్తుల్లో కాదని, అది వ్యక్తిత్వంలో ఉందని చెబుతోంది. ఆమె చెప్పినట్లుగా, చీరలో తాను అద్భుతంగా ఉంటానని పేర్కొంది. 'గజిని' సినిమాలో తను చేసిన పాత్ర వాస్తవానికి తనకు నచ్చని అంశంగా చెప్పిన నయనతార, కొన్ని వెబ్‌సైట్లలో అసత్య ప్రచారాలను చేశారని తెలిపింది. దీంతో అప్పటి నుండి మీడియాకు దూరంగా ఉండటం ప్రారంభించింది. ఆమె జీవితంలోని ఎమోషనల్ ప్రయాణం, వృత్తిపరమైన అనుభవాలను "లేడీ సూపర్ స్టార్" అనే డాక్యుమెంటరీలో ప్రేక్షకులకు అందిస్తొంది. ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం 'నెటిప్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది.