NBK 109: డాకు మహారాజ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్.. ఎప్పుడంటే..?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాగా "డాకు మహారాజ్" లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్‌గా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ బాధ్యతలు చేపట్టగా, నాగవంశీ సితార ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాణం చేస్తున్నారు. బాలయ్య సరసన హీరోయిన్స్‌గా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించనుండగా, యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. హై-ఎండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను పెంచాయి.
విలన్‌గా బాబీ డియోల్
ఈ చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా,ఈ సినిమా మొదటి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయటానికి మేకర్స్ సన్నద్ధమయ్యారు. సాంగ్ రిలీజ్ డేట్‌ను ప్రకటించకుండానే, "డాకు ఫస్ట్ సింగిల్ అదరగొడుతుంది, బ్లాక్‌బస్టర్ తమన్, బాలయ్య కాంబో మరోసారి సెన్సేషన్ చేయడానికి వస్తున్నారు" అని మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 15 తర్వాత సాంగ్ విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమాలకు తమన్ సంగీతం అందించిన "అఖండ", "వీరసింహా రెడ్డి", "భగవంత్ కేసరి" వంటి చిత్రాలు సెన్సేషన్ సృష్టించగా, "డాకు" కూడా దానికి మించి ఉంటుందని యూనిట్ భావిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించనున్నారు.