Page Loader
NBK-Gopichand Malineni:మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే! 
మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే!

NBK-Gopichand Malineni:మరోసారి సూపర్ హిట్ కాంబోలో సినిమా?..ఫ్యాన్స్‌కు పండగే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2024
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి-ఎన్టీఆర్, మహేశ్-పూరి, పవన్-హరీష్, బాలయ్య-బోయపాటి లాంటి కాంబోలు అనగానే ఫ్యాన్స్ కు పండగే అనిచెప్పొచ్చు. ఇక బాలయ్య, గోపిచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కిన 'వీరసింహా రెడ్డి' సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా మరోసారి వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి సినిమాను నిర్మించిన 'మైత్రీ మూవీస్' ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.

Details

బాబీ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ

ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్‌తో ఓ సినిమా డైరెక్ట్ చేస్తున్న గోపిచంద్, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వెంటనే బాలయ్యతో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్‌లో ఉండగా, దీన్ని డిసెంబర్ లేదా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.