Netflix : సినీ ప్రేక్షకులకు ఓటిటి నెట్‌ఫ్లిక్స్ షాక్.. ఇకపై సెన్సార్ సినిమాలకే స్ట్రీమింగ్ ఛాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి అన్ కట్ సీన్స్,సెన్సార్ అనుమతి లేని సీన్లకు స్ట్రీమింగ్ ఛాన్స్ లేదని కుండబద్దలు కొట్టింది.
ఇప్పటికే వేరే ఓటిటిల్లో వెబ్ సిరీస్, సొంత కంటెంట్స్ ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మాత్రం సెన్సార్ చేసినవే రిలీజ్ చేసేందుకు సంస్థ నిర్ణయం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఓటిటిల్లో ఒకటిగా నెట్‌ఫ్లిక్స్ పేరు గాంచింది.భారతదేశంలోనూ దీనికి చాలామంది సబ్ స్క్రైబర్స్ ఉండటం విశేషం.
ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్ స్థానిక మర్కెట్ మీద దృష్టి సారిస్తోంది.కొత్త సినిమాలు,సిరీస్'లతో ప్రేక్షకుల ముందుకి వస్తోంది.
ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ సీఈఓ టాలీవుడ్ నటులను కలిశారు.నెట్‌ఫ్లిక్స్'లో నాణ్యమైన కంటెంట్ సహా బోల్డ్, A సర్టిఫికెట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోంది.
details
ఇకపై అలా చేయబోం : ఓటిటి నెట్ ఫ్లిక్స్
అయితే కొందరు ప్రేక్షకులు అలాంటి కంటెంట్ కోసమే నెట్‌ఫ్లిక్స్ తీసుకుంటారు. ఇండియన్ సెన్సార్ బోర్డు సినిమాలని సెన్సార్ చేసి రిలీజ్ కి పర్మిషన్స్ ఇస్తుంది.
అయితే సెన్సార్ చేయని వర్షన్ సినిమాలని ఓటీటీల్లో రిలీజ్ చేస్తారు చిత్రయూనిట్. అయితే ఇటీవల ఓటిటిల్లో ఎక్కువగా A రేట్ కంటెంట్, అసభ్యకర కంటెంట్ పెరుగుతోంది. దీంతో ఓటిటిల్లో సెన్సార్ ఉండాలని చాలామంది అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
ఇప్పటికే ఓటిటి వెబ్ సిరీస్'లు ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మాత్రం సెన్సార్ చేసినవే రిలీజ్ చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్ మాత్రం సెన్సార్ కట్ చేసిన సీన్స్'తో కలిపి స్ట్రీమింగ్ చేస్తుంది. ఇకపై కట్ సీన్స్ స్ట్రీమింగ్ కానివ్వబోమని ప్రకటించింది.