చంద్రయాన్-3 బయోపిక్ చేయాలంటూ బాలీవుడ్ హీరోకు పెరుగుతున్న రిక్వెస్టులు
చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశం అరుదైన ఘనత సాధించింది. చంద్రయాన్-3, చంద్రుడిపై సురక్షితంగా అడుగుపెట్టిన క్షణం భారతీయుల ఛాతి గర్వంతో ఉప్పొంగింది. చంద్రయాన్-3 విజయోత్సవ సంబరాలను సోషల్ మీడియాలో విశేషంగా జరుపుకుంటున్న నెటిజన్లు చంద్రయాన్-3 బయోపిక్ తీస్తే బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. చంద్రయాన్-3 బయోపిక్ తీయాలని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు రిక్వెస్ట్ చేస్తున్నారు. చంద్రుడి మీద జెండా ఎగరేయాలన్న ఆలోచన ఇస్రోకి ఎప్పుడు మొదలైంది? ఆ తర్వాత చంద్రయాన్-2 ఫెయిల్ అయినప్పుడు ఎదుర్కొన్న అవమానాలు, చంద్రయాన్-3 సక్సెస్ కావడంలో ఇస్రో శాస్త్రవేత్తల కృషి మొదలగు అంశాల స్ఫూర్తితో చంద్రయాన్-3 బయోపిక్ తీస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మిషన్ మంగళ్ యాన్ చిత్రంలో నటించిన అక్షయ్ కుమార్
ప్రస్తుతం చంద్రయాన్-3 బయోపిక్ విషయమై సోషల్ మీడియాలో అనేక పోస్టులు వస్తున్నాయి. మరి ఈ పోస్టులన్నీ అక్షయ్ కుమార్ వరకు చేరతాయా లేదా అనేది చూడాలి. అదలా ఉంచితే అక్షయ్ కుమార్ గతంలో మిషన్ మంగళ్ యాన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అలాగే రామసేతు కట్టడంపై కూడా సినిమా తీసి ప్రేక్షకులకు అందించాడు. ఈ కారణంగానే అక్షయ్ కుమార్ కు చంద్రయాన్-3 బయోపిక్ తీయాలనే రిక్వెస్టులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ రిక్వెస్ట్ లను అక్షయ్ కుమార్ పరిగణలోకి తీసుకొని చంద్రయాన్-3 బయోపిక్ గురించి ఆలోచిస్తాడేమో చూడాలి.