
Samantha: సమంత వేలికి ప్రత్యేక ఉంగరం.. నెట్టింట ఎంగేజ్‌మెంట్ రూమర్స్
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నప్పటికీ, స్టార్ హీరోయిన్ సమంత పేరు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లోనే ఉంటుంది. సినిమాలకంటే ఎక్కువగా ఆమె వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. సమంత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులతో నేరుగా టచ్‌లో ఉంటుంది. ఇటీవల దర్శకుడు రాజ్ నిడమోరుతో సమంత రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు నెట్టింట్లో గట్టిగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి అమెరికా వెకేషన్‌కి వెళ్లినట్టు, ఇటీవల ఒకే కారులో కలిసి కనిపించినట్టు కూడా పలు వార్తా కథనాలు వచ్చాయి. దీంతో వారి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
వివరాలు
లైట్‌లో మెరిసిపోతూ స్పెషల్ ఉంగరం
తాజాగా, సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఆ ఫొటోలో ఆమె ఒంటరిగా ఓ కేఫేలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కనిపించింది.అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఆమె చేతి వేలిపై మెరిసిన ఓ ప్రత్యేకమైన ఉంగరం. ఆ ఉంగరం ఓవల్ ఆకారంలో ఉండి,మధ్యలో ఉన్న స్టోన్‌ను చుట్టూ చిన్న డైమండ్‌లతో అలంకరించారు. ఆ డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పాటు లైట్‌లో మెరిసిపోతూ స్పెషల్‌గా కనబడింది. గతంలో ఎప్పుడూ సమంత చేతికి ఇలాంటి రింగ్ కనిపించకపోవడం వల్ల ఇది కొత్తదేనన్న అనుమానం కలుగుతోంది. దీంతో చాలామంది నెటిజన్లు,ఈ ఉంగరం రాజ్ నిడమోరు ఇచ్చిందా?అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
వివరాలు
'శుభం' సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్
ఇది నిశ్చితార్థ ఉంగరమే అయి ఉండవచ్చని, ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకు ముందు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' వంటి వెబ్‌సిరీస్‌లలో సమంత ప్రధాన పాత్రలో నటించగా, వాటిని రాజ్-డీకే దర్శకత్వం వహించారు. అప్పుడు నుంచే ఆమెకు రాజ్‌తో స్నేహం మొదలై, ఆ బంధం మెల్లగా ప్రేమగా మారిందనే వార్తలు అప్పటినుంచి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సమంత నిర్మించిన 'శుభం' సినిమాకు రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం కూడా ఈ సంబంధాన్ని బలపరచిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ రూమర్లపై నే సమంత గానీ,రాజ్ గానీ అధికారికంగా స్పందించలేదు. కాని రోజుకొక కొత్త పుకారు మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది.