VISA Vintara Saradaga: మహేశ్ బాబు మేనల్లుడి కొత్త సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవత్సరానికి వినోదభరితంగా స్వాగతం పలికేందుకు యంగ్ హీరో, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సిద్ధమవుతున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా 'VISA-వింటారా సరదాగా' ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ప్రేమ, స్నేహం, సరదా, యువత జీవితంలోని అనుభవాల కలయికగా తెరకెక్కింది.
వివరాలు
అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల కథ
కలలను సాకారం చేసుకోవాలనే ఆశయంతో స్వదేశాన్ని విడిచి అమెరికాకు వెళ్లే తెలుగు విద్యార్థుల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది.
విదేశాల్లో విద్యార్థుల జీవనశైలి, స్నేహాలు, ప్రేమలు, అనుకోని సంఘటనలు, ఎదురయ్యే ఆసక్తికరమైన పరిస్థితులను వినోదాత్మకంగా చూపించనున్నారు.
ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అశోక్ గల్లా, గౌరీ ప్రియ మధ్య కెమిస్ట్రీ, యూత్‌ఫుల్ కథాంశం, వినోదభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
'వింటారా సరదాగా' మ్యూజికల్ ప్రమోషన్స్‌కు కూడా మంచి స్పందన లభిస్తోంది. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వివరాలు
భారీ తారాగణంతో సినిమా
ఈ చిత్రంలో అశోక్ గల్లా, గౌరీ ప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, సత్య, వైవా హర్ష, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఎస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'చెన్నై లవ్ స్టోరీ'తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న గౌరీ ప్రియ.. 'వింటారా సరదాగా'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
2027 జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమా యువతను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.