Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో నిందితుడి కొత్త వీడియో.. ముంబై పోలీసుల గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసిన నిందితుడి కోసం ముంబై పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం, పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పడి ముంబై మొత్తం వివిధ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు.
ఈ క్రమంలో నిందితుడి తాజా గుర్తింపు ఒక మొబైల్ షాప్‌లో జరిగిందని, ఆ దృశ్యాలను సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా బయట పెట్టారు.
ఫుటేజ్‌లో నిందితుడు దాడి జరిగిన ఆరు గంటల తర్వాత, సాయంత్రం 9 గంటల ప్రాంతంలో ఒక మొబైల్ షాప్‌లో ఇయర్ ఫోన్స్ కొనుగోలు చేస్తున్నట్లు కనబడ్డాడు.
ఆ వీడియోలో అతను బ్లూ షర్ట్ ధరించాడు. ముంబై పోలీసులు ఈ షాప్ నుండి సీసీ టీవీ ఫుటేజ్ సేకరించి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వీడియో రిలీజ్ చేసిన ముంబై పోలీసులు
Mumbai, Maharashtra: Officers from the Crime Branch visited the Kabutarkhana area in Dadar and collected CCTV footage from a mobile shop named "Iqra" from where he purchased headphones after attacking actor Saif Ali Khan pic.twitter.com/ILxBjsD7eZ
— IANS (@ians_india) January 18, 2025