Page Loader
హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్ 
హరిహర వీరమల్లు సినిమా నుండి నిధి అగర్వాల్ పంచుకున్న ఫోటో

హరిహర వీరమల్లు సినిమాపై నిధి అగర్వాల్ ఎమోషనల్: వైరల్ అవుతున్న పోస్ట్ 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 17, 2023
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి నిధి అగర్వాల్ ఓ పిక్ షేర్ చేసింది. హరిహర వీరమల్లు సినిమాలో నటించడంతో తన కల నెరవేరిందనీ, ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని ఆమె అంది. పవన్ కళ్యాణ్, క్రిష్, ఏమ్ రత్నం వంటి దిగ్గజాల సినిమాలో తాను నటించడం అదృష్టమని చెబుతూ, మరికొన్ని రోజుల్లో వెండితెర మీద అద్భుతాన్ని చూస్తారని హరిహర వీరమల్లు సినిమాలోని తొలిరోజు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోను పంచుకుంది.

Details

అధికారికంగా రిలీజ్ కాని ఫోటోను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ 

నిజానికి ఈ ఫోటోను మొదటగా పవన్ కళ్యాణ్, తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసారు. సినిమా రంగంలో తాను చేసిన సినిమాల నుండి కొన్ని క్లిప్స్ ని, తాను కలిసిన సినీ మిత్రుల ఫోటోలను పవన్ కళ్యాణ్ షేర్ చేసారు. అందులో హరిహర వీరమల్లు సినిమాలోని నిధి అగర్వాల్ ఫోటో కూడా ఉంది. ఈ ఫోటోను ఇప్పటివరకు అధికారికంగా హరిహర వీరమల్లు సినిమా నుండి రివీల్ చేయలేదు. అయితే నిధి అగర్వాల్ పంచుకున్న ఫోటోలో పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ముఖాలు మసక మసగ్గా కనిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళ ముఖాల్లోని ఎక్స్ ప్రెషన్స్ అర్థమైపోతున్నాయి. ఏదైతేనేం చాలారోజుల తర్వాత హరిహర వీరమల్లు సినిమా నుండి అభిమానులకు ఫోటో రూపంలో అప్డేట్ వచ్చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిధి అగర్వాల్ ట్వీట్